road accident: ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డ ప్రభుత్వ వాహనం.. ఆరుగురి దుర్మరణం!

ఫ్లైఓవర్ పైనుంచి పభుత్వ వాహనం ఒకటి కింద పడ్డ ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరువూరు జిల్లా థెక్కలూర్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా పురుషులే. వీరు చెన్నైకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆరు లైన్ల రోడ్డుపై ప్రయాణిస్తున్న ఈ వాహనం ఓ బస్సును ఢీకొని అదుపుతప్పింది. అనంతరం ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడిపోయింది. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు.
road accident
tamil nadu
six employees dead

More Telugu News