rajamouli: 'బాహుబలి' గురించి రాజమౌళి కొత్త ఆలోచన .. రెండు భాగాలు ఒకే సినిమాగా!

  •  'బాహుబలి' ఘన విజయాన్ని సాధించింది 
  •  'బాహుబలి 2' అంతకి మించిన విజయాన్ని సొంతం చేసుకుంది
  •  రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా అందించే ఆలోచనలో  రాజమౌళి
  •  అంతగా అవసరం లేని సన్నివేశాల తొలగింపు

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలుగు సినిమా వైభవానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన 'బాహుబలి 2' అంతకి మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పింది.

అలాంటి ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్తగా ఒక ఆలోచన చేశాడనే టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలోను .. రెండవ భాగంలోను అంతగా అవసరం లేని సన్నివేశాలను తొలగించి, కీలకమనుకున్న సన్నివేశాలను యాడ్ చేస్తూ ఒకే సినిమాగా తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారట. 3 గంటల నిడివిలోనే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఒక భాగం చూసిన చాలా కాలానికి ప్రేక్షకులు రెండవ భాగం చూశారు. అలా కాకుండా ఒకేసారి సినిమా మొత్తం చూసేశామనే ఫీలింగ్ ను కలిగించడం కోసం రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   

More Telugu News