chandra babu: 'అలయ్ బలయ్'కి చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే విజయవాడకు వచ్చా!: దత్తాత్రేయ

తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నేడు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మవారిని దర్శించుకోవడం ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఆలయ పరిసరాలు చూస్తుంటే స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బాగా నిర్వహిస్తున్నారని అనిపిస్తోందని కితాబిచ్చారు.

ప్రతి ఏడాది దసరా అనంతరం హైదరాబాదులో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయతీ అని... ఆ కార్యక్రమానికి చంద్రబాబును ముఖ్య అతిధిగా ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు. ఈ సాయంత్రం చంద్రబాబుతో భేటీ అవుతున్నానని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకార భావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  
chandra babu
ap cm
bandaru dattatreya
alay balay
vijayawada

More Telugu News