AP: ఏపీకి 16, టీఎస్ కు 6 టీఎంసీలు... అది కూడా శ్రీశైలంలో 854 అడుగులు దాటితేనే: కృష్ణా బోర్డు ఆదేశం

  • కనీస నీటి నిల్వలను నిర్వహించాల్సిందే
  • ఆ స్థాయి దాటితేనే తెలుగు రాష్ట్రాలకు పంపిణీ
  • స్పష్టం చేసిన బోర్డు కార్యదర్శి సమీర్

కృష్ణా నదీ జలాల పంపిణీ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఈ ఉదయం సమావేశమైన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కీలక సూచనలను చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగులు, నాగార్జున సాగర్ లో 510 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించాల్సిందేనని, ఆ స్థాయికన్నా నీటి మట్టం పెరిగితేనే రెండు రాష్ట్రాలకూ నీటిని పంపాలని నిర్ణయించామని బోర్డు కార్యదర్శి సమీర్ ఈ సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలంలోని నీటిలో ఏపీకి 16 టీఎంసీలు, టీఎస్ కు 6 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. తదుపరి సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.

More Telugu News