dera baba: డేరా బాబా లీలలన్నీ నాకు అప్పుడే తెలుసు: రాఖీ సావంత్

  • డేరా బాబా ఆశ్రమానికి ఒకసారి వెళ్లాను
  • అప్పుడే వయాగ్రా పొట్లాలు చూశాను
  • ఆ రోజే హనీ ప్రీత్, డేరా బాబా లీలలు తెలిశాయి
  •  అప్పుడే వాడి బండారం బయటపెట్టాలని భావించాను
  • ప్రస్తుతానికి డేరాబాబా, హనీప్రీత్ మధ్య ఐటెం సాంగ్ చిత్రీకరణ పూర్తయింది 
డేరా బాబా లీలలన్నీ తనకు ముందే తెలుసని బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ తెలిపింది. డేరా బాబాపై తీస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చిత్రీకరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హనీ ప్రీత్ తో తనకు సాన్నిహిత్యముండడంతో తాను ఒకసారి డేరా బాబా ఆశ్రమానికి వెళ్లానని చెప్పింది.

అక్కడ తనకు వయాగ్రా పొట్లాలు కనిపించాయని, అప్పుడే తనకు డేరా బాబా, హనీప్రీత్ లీలలు తెలిశాయని తెలిపింది. అప్పుడే వీడి చీకటి సామ్రాజ్యపు లీలల్ని బయటపెట్టాలని భావించానని చెప్పింది. ప్రస్తుతానికి హనీప్రీత్, గుర్మీత్ లపై ఐటెంసాంగ్ చిత్రీకరణ పూర్తైందని తెలిపింది. ఢిల్లీ శివార్లలో నిర్మించిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 
dera baba
gurmeet ram raheem singh
hanipreet
movie
rakhi savanth

More Telugu News