vijay: ఒక్కరోజులో కోటి వ్యూస్ కొట్టేశాడు ... ఈ సారి ఇక్కడా హిట్ ఖాయమంటున్నాడు!

  •  విజయ్ తాజా చిత్రంగా రూపొందిన 'మెర్సెల్' 
  •  ఈ సినిమా టీజర్ కి ఒక్క రోజులో కోటి వ్యూస్
  •  'అదిరింది' పేరుతో తెలుగులోకి
  •  రెండు భాషల్లోను అక్టోబర్ 18న విడుదల     

కోలీవుడ్ అగ్రకథానాయకులలో విజయ్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే చాలు యూత్ కు .. మాస్ ఆడియన్స్ కు పండగే. ఆయన తాజా చిత్రంగా 'మెర్సెల్' చిత్రం రూపొందింది. అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల సరసన కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా అలరించనున్నారు.

 ఈ నెల 21వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. ఒక్క రోజులోనే ఈ టీజర్ కోటి వ్యూస్ ను రాబట్టడం విశేషం. విజయ్ కి గల క్రేజ్ కు .. ఈ సినిమా పట్ల అభిమానులు చూపుతోన్న ఆసక్తికి ఈ వ్యూస్ కొలబద్దగా చెప్పుకుంటున్నారు. విజయ్ కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుందని అంటున్నారు. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి ఇక్కడా హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో విజయ్ వున్నాడట. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.   

More Telugu News