richest woman: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ, లోరియల్ వారసురాలు లిలియానె కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ అయిన లిలియానె బెటెన్‌కోర్టు 94 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూశారు. కాస్మొటిక్ ఉత్పత్తుల దిగ్గజం లోరియల్ ‌ను స్థాపించింది లిలియానే కుటుంబమే. ప్రస్తుతం ఈ సంస్థకు ఆమే వారసురాలు. లోరియల్‌లో ఇప్పటికీ వీరి కుటుంబానికి 33 శాతం వాటా ఉంది. లిలియనె 1922లో పారిస్‌లో జన్మించారు. ఐదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. 15 ఏళ్ల వయసులో తన కుటుంబ వ్యాపారంలో అప్రెంటిస్ చేశారు. 1957లో లోరియల్ కంపెనీకి అధినేత్రి అయ్యారు. 1950లో ఫ్రెంచ్ రాజకీయ వేత్త ఆండ్రె బెటెన్‌కోర్టును వివాహమాడారు. 1960, 70లలో ఫ్రెంచ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
richest woman
Liliane Bettencourt
died

More Telugu News