musharaf: బెనజీర్ భుట్టోను ఆమె భర్తే చంపించాడు!: సంచలన ఆరోపణలు చేసిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్

  • ఆమె హత్యకు కారణం ఆమె భర్తే
  • ఆమెను హతమార్చడం వల్ల లాభపడింది ఆయన ఒక్కరే
  • ఐదేళ్ల దేశాధ్యక్షుడిగా పని చేసిన ఆమె భర్త ఈ కేసు విచారణ ఎందుకు పూర్తి చేయించలేదు?
  • ఈ కేసులో ఆమెతోపాటు కారులో ఉన్న పోలీసులను ఎందుకు విచారించలేదు
  • నాపై ఆరోపణలు చేయడం వల్లే ఈ వీడియో విడుదల చేస్తున్నా
  • అధికారం కోసమే ఆయన ఆమెను హత్య చేయించారు

డిసెంబర్ 2007లో ఎన్నికల ర్యాలీలో దారుణ హత్యకు గురైన పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోని చంపించింది ఆమె భర్త అసిఫ్ అలీ జర్దారీయేనని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలతో ఆయన ఒక వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్టు చేశారు. అందులో బెనజీర్ ఏ పార్టీకైతే ప్రాణం పోసారో ఆ పార్టీని టేకోవర్ చేసేందుకు ఆయనే (ఆమె భర్త) ఈ పని చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె హత్య వెనుక తన హస్తముందని జర్దారీ ఆరోపిస్తున్నారని, అందుకే తానీ వీడియో విడుదల చేయాల్సి వచ్చిందని ఆయన ఈ తెలిపారు. అంతేకాకుండా ఈ మధ్యే ఈ కేసును విచారించిన యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

ఆమె హత్యకు కారణమైన ఇద్దరు పోలీసు అధికారులను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఆమె హత్య జరిగినరోజు ఆమె కారులో ఉన్న కొందరు పోలీసు అధికారులను విచారించలేదని ఆయన తెలిపారు. తానీ వీడియోను పాకిస్థాన్, బెనజీర్ కుటుంబ సభ్యుల కోసం విడుదల చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. భుట్టో మరణానంతరం ఐదేళ్ల పాటు ఆమె భర్త దేశాధ్యక్షుడిగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ఆమె మృతి పట్ల ఎలాంటి విచారణ జరగలేదని ఆయన తెలిపారు. ఆమె మృతిచెందడం వల్ల లాభపడింది కేవలం జర్దారీ మాత్రమేనని ఆయన ఆరోపించారు. దీని వల్ల తెలియడం లేదా? ఈ హత్య వెనుక ఎవరున్నారో? అంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

  • Loading...

More Telugu News