nuclear submarine: చైనా నేవీలో అత్యాధునిక న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్‌!

చైనా నేవీలో ఈ రోజు మ‌రో న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్‌ వచ్చి చేరింది. దీంతో ఆ దేశ నౌకాద‌ళం మరింత బలోపేతం అయింది. చైనా నేవీ వ‌ద్ద ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న‌ సబ్‌ మెరైన్లలో ఇదే అత్యాధునికమైనది. ఈ కొత్త సబ్‌ మెరైన్‌తో త‌మ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల‌ను చైనా 69కి పెంచుకుంది. ఈ అత్యాధునిక న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్.. టైప్‌-096 సబ్‌ మెరైన్‌గా అంత‌ర్జాతీయ‌ నిపుణులు భావిస్తున్నారు. ఈ స‌బ్ మెరైన్‌కు సంబంధించి ఎటువంటి వివ‌రాల‌ను చైనా వివ‌రించలేదు. దీన్ని చైనా షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్ త‌మ‌ డలియన్‌ షిప్‌ యార్డులో రూపొందించినట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News