manam: ఇది రియ‌ల్‌లైఫ్ `మ‌నం` సెల్ఫీ!

`మ‌నం` సినిమా ఫ‌స్ట్‌లుక్‌గా విడుద‌ల చేసిన ఫొటో గుర్తుంది క‌దా! నాగేశ్వ‌రరావు, నాగార్జున, నాగ‌చైత‌న్యలు వారి వారి గెట‌ప్‌ల‌లో ఉన్న ఆ ఫొటోను చాలా మంది ఇష్ట‌ప‌డ్డారు. కానీ అందులో అఖిల్ కూడా ఉంటే బాగుండున‌ని అభిమానులు అనుకున్నారు. ఇప్పుడు వారి కోరిక తీరింది. ఎలాగంటారా?.... తాజాగా నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్ క‌లిసి దిగిన సెల్ఫీని అఖిల్ షేర్ చేశాడు.

తాత అక్కినేని నాగేశ్వ‌రరావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌ ఫొటో ద‌గ్గ‌ర దిగిన ఈ సెల్ఫీని నెటిజ‌న్లు తెగ‌పొగిడేస్తున్నారు. కాక‌పోతే ఈ రియ‌ల్ లైఫ్‌ సెల్ఫీలో నాగేశ్వ‌రరావు ఫొటో మాత్ర‌మే ఉండ‌టం కొంత వెలితిగా అనిపిస్తోంది. మ‌రో విష‌యం ఏంటంటే.. ఒక్క‌సారిగా మీసాలు లేకుండా నాగార్జున, పూర్తి గ‌డ్డం, మీసాల‌తో నాగ‌చైత‌న్య‌, అఖిల్ ఈ ఫొటోలో ఉండ‌టంతో `కుమారుల కంటే తండ్రి యంగ్‌గా క‌నిపిస్తున్నాడు` అంటూ కొంత‌మంది నెటిజ‌న్లు కామెంట్ చేశారు.

More Telugu News