sufi: భార‌త్‌లో సూఫీ సంగీత క‌చేరీలో మొద‌టిసారి పాల్గొన‌నున్న ఏఆర్ రెహ‌మాన్‌

దేశ‌విదేశాల్లో ఏఆర్ రెహ‌మాన్ సంగీత క‌చేరీలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వీట‌న్నింటిలోనూ సినిమా పాట‌లు ఎక్కువ‌గా వినిపించేవి. అయితే దేశంలో నిర్వ‌హించనున్న సూఫీ సంగీత క‌చేరీలో మొద‌టిసారి ఏఆర్ రెహ‌మాన్ పాల్గొన‌నున్నారు. న‌వంబ‌ర్ 18న ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగ‌ణంలో ఈ క‌చేరీ జ‌ర‌గ‌నుంది.

భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న త‌న మొద‌టి సూఫీ క‌చేరీలో పాల్గొన‌డానికి చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు రెహ‌మాన్ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించాడు. `ద సూఫీ రూట్‌` వారు నిర్వ‌హిస్తున్న ఈ క‌చేరీలో రెహ‌మాన్‌తో పాటు ప్ర‌ముఖ సూఫీ సంగీత క‌ళాకారులు హాన్స్ రాజ్ హాన్స్‌, నూర‌న్ సిస్ట‌ర్స్‌, ముక్తియార్ అలీ, ధ్రువ్ సంగారీ వంటి దిగ్గ‌జాలు పాల్గొననున్నారు.
sufi
ar rahman
india
kutub minar
delhi
nooran sisters

More Telugu News