viral video: వైర‌ల్ వీడియో: చిన్న పాప‌తో జిమ్నాస్టిక్స్ చేయించిన తండ్రి... మండిప‌డ్డ నెటిజ‌న్లు

ఉక్రెయిన్‌కి చెందిన ఓ వ్య‌క్తి త‌న కూతురితో జిమ్నాస్టిక్స్ చేయిస్తున్న వీడియోపై నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఆ వీడియోను చైల్డ్ అబ్యూస్‌గా యూట్యూబ్‌కి రిపోర్ట్ చేస్తున్నారు. నాలుగు నిమిషాలున్న ఈ వీడియోలో చిన్నపాప‌ భ‌యంతో అరుస్తున్నా ప‌ట్టించుకోకుండా పాప తండ్రి త‌న‌తో విన్యాసాలు చేయించ‌డం చూడొచ్చు. పాప ఒక్క కాలు ప‌ట్టుకుని తిప్పుతూ వ్యోమ‌గాముల శిక్ష‌ణ కూడా ఇలాగే సాగుతుంద‌ని ఆ తండ్రి చెప్ప‌డం చాలా క‌ర్క‌శంగా అనిపిస్తుంది.

అలా చేయ‌డం వ‌ల్ల పాప ఎముక‌లు గ‌ట్టిప‌డ‌తాయ‌ని, ఆమెకు చాలా మంచి క‌లుగుతుంద‌ని చెప్ప‌డం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. `ప్ర‌పంచంలో అతి చిన్న వ‌య‌స్కురాలైన జిమ్నాస్టిస్ట్‌` అనే టైటిల్‌తో ఆ వ్య‌క్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే నెటిజ‌న్లు అతని వైఖ‌రిని ఖండిస్తూ కామెంట్ల‌లో తిట్ల వ‌ర్షం కురిపించారు.

More Telugu News