pv sindhu: సింధుపై ప్రతీకారం తీసుకున్న ఒకుహార!

జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. కొరియా ఓపెన్ సిరీస్ లో విజయకేతనం ఎగురవేసి, సూపర్ ఫామ్ లో ఉన్న సింధు... జపాన్ ఓపెన్ లో ప్రీక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహారా చేతిలో 18-21, 8-21 తేడాతో సింధు ఓడిపోయింది. ఈ గెలుపుతో సింధుపై ఒకుహారా ప్రతీకారం తీర్చుకున్నట్టైంది. కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు చేతిలో ఒకుహారా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలిగేమ్ లో పోరాటాన్ని కనబరిచిన సింధు, రెండో గేమ్ లో మాత్రం చేతులెత్తేసింది. రెండు తప్పిదాలను చేసిన సింధు భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. 
pv sindhu
okuhara
japan open
japan open super series

More Telugu News