team india: రోహిత్ అవుట్... అవకాశాన్ని వదలని కౌల్టర్ నైల్!

  • రోహిత్ ను అవుట్ చేసిన కౌల్టర్ నైల్
  • ఆఫ్ స్టంప్ పై బంతిని సంధించి ఉచ్చులో పడేసిన కౌల్టర్ 
  •  బౌలర్ తల పైనుంచి బౌండరీకి తరలించాలని ప్రయత్నించిన రోహిత్ శర్మ
  • తలపై నుంచి వెళ్తున్న బంతిని ఒడిసిపట్టేసిన పొడగరి కౌల్టర్ 
  •  క్రీజులో రహానేకు జతగా కోహ్లీ

టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడిన రోహిత్ శర్మ...6వ ఓవర్ తొలి బంతిని బౌలర్ తలపై నుంచి బంతిని బౌండరీ లైన్ కు తరలించాలని భావించాడు. ఆఫ్ స్టంప్ మీదుగా కౌల్టర్ నైల్ సంధించిన బంతిని బలంగా బాదాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తగలడంతో ఆశించిన ఎత్తులో వేగంతో వెళ్లలేదు. దీంతో బంతిని వేసిన కౌల్టర్ నైల్ పొడగరి కావడంతో వేగంగా స్పందించి బంతిని ఆపేశాడు.

అయితే బంతి అతని చేతి నుంచి ఎగిరిపోవడంతో మరోసారి దానిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ అవుటయ్యాడు. కోహ్లీని బాగా చదివిన ఆసీస్ ఆటగాళ్లు ఆఫ్ స్టంప్ కు కొంచెం బయట బంతులు సంధిస్తూ రెచ్చగొడుతున్నారు. ఈ తరహా బంతులు ఆడడంలో కోహ్లీ బలహీనుడు. ఆఫ్ స్టంప్ కు కొంచెం బయట వెళ్లే బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించడంలో పలు మార్లు కోహ్లీ అవుటయ్యాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు కోహ్లీని అవుట్ చేసేందుకు అలాంటి బంతులు విసురుతున్నారు. క్రీజులో రహానే (19) కు జతగా కోహ్లీ (1) ఆడుతున్నాడు. 

More Telugu News