team india: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

  • బ్యాటింగ్ ఆరంభించిన రహానే, రోహిత్
  • మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం
  • పిచ్ పై పచ్చిక ఉండడంతో పేసర్లే కీలకం
  • మ్యాచ్ విజయంపై రెండు జట్లు ధీమా
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్ ను రహానే (11), రోహిత్ (6) ప్రారంభించారు. కాగా, మ్యాచ్ పై వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. ఉదయం నుంచి తెరిపిగా ఉండడంతో కవర్స్ తొలగించారు. పిచ్ పచ్చికగా ఉండడంతో పేసర్లతో రెండు జట్లు బరిలో దిగాయి. రెండు జట్లు విజయమే లక్ష్యంగా ఉరుకుతున్నాయి. ఆసీస్ పై ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా వ్యూహాలు రచించగా, విజయం సాధించి సిరీస్ లో సమఉజ్జీగా నిలవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ అభిమానులను అలరించనుంది. 
team india
austrelia
indian cricket team
aissies

More Telugu News