ramgopal varma: ఎన్టీఆర్ మూవీ చేయొద్దని పూరీతో వర్మకి చెప్పించనున్నారా?

  • ఎన్టీ రామారావు బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాల్లో బాలకృష్ణ
  • అదే బయోపిక్ ను తాను చేయనున్నట్టుగా వర్మ ప్రకటన
  • వద్దని చెప్పడానికి రంగంలోకి బాలకృష్ణ సన్నిహితులు
  • పూరీతో వర్మకు చెప్పించే ప్రయత్నాలు  
ఎన్టీరామారావు జీవిత చరిత్రను తెరకెక్కించనున్నామనీ .. ఆయన పాత్రలో తానే నటిస్తానని బాలకృష్ణ చెప్పారు. అదే సమయంలో ఎన్టీఆర్ సినిమాను గురించిన ప్రస్తావన రామ్ గోపాల్ వర్మ తెచ్చాడు. దాంతో ఈ సినిమాకి ఆయనే దర్శకుడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఛాన్స్ ఆయనకి ఇచ్చే ఉద్దేశం బాలకృష్ణలో కనిపించలేదు.

బాలకృష్ణ ఛాన్స్ ఇవ్వలేదని వర్మ ఈ విషయాన్ని పక్కన పెట్టేయలేదు. తన స్టైల్లో తాను ఈ సినిమాను తెరకెక్కించడానికి వర్మ సిద్ధమవుతున్నాడు. దాంతో వర్మ ప్రయత్నాలను ఆపడానికి బాలకృష్ణ సన్నిహిత వర్గాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఎన్టీ రామారావు బయోపిక్ కి సంబంధించి రెండు సినిమాలు తెరకెక్కడం కరెక్ట్ కాదనే విషయాన్ని వాళ్లు పూరీ జగన్నాథ్ ద్వారా వర్మకి చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారట. తాను ఒక నిర్ణయం తీసుకున్నాక అందుకు సంబంధించి ఎవరి మాటలను వినిపించుకొని వర్మ, పూరీ మాట వింటాడా అని!   
ramgopal varma
puri

More Telugu News