deepika padukone: దీపిక అభిమానుల‌కు న‌వ‌రాత్రి కానుక‌... `ప‌ద్మావతి` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న పీరియాడిక‌ల్ డ్రామా `ప‌ద్మావ‌తి` సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. ఇందులో టైటిల్ పాత్ర పోషిస్తున్న దీపికా పదుకొనే ఫ‌స్ట్‌లుక్‌ని చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. `న‌వ‌రాత్రి పండుగ సంద‌ర్భంగా ఛిత్తోడ్ మ‌హారాణి ప‌ద్మావ‌తిని క‌లుసుకోండి` అని దీపికా పేర్కొంది.

ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ, రావ‌ల్ ర‌త‌న్ సింగ్ పాత్ర‌లు పోషిస్తున్న ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ కూడా దీపికా ప‌దుకొనే లుక్‌ను షేర్ చేశారు. ఇలాంటి మ‌హారాణి పాత్ర‌లు దీపికా ప‌దుకొనేకి కొత్తేం కాదు. అయిన‌ప్ప‌టికీ ప‌ద్మావ‌తి లుక్‌లో ఏదో కొత్త‌ద‌నం క‌నిపిస్తోంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. డిసెంబ‌ర్ 1న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.
deepika padukone
padmavathi
navrathri
ranveer singh
first look
shahid kapoor
sanjay leela bhansali

More Telugu News