akkineni akhil: నాకు క్రికెట్ అంటే ప్రాణం.. ఫుట్ బాల్ కూడా ఆడేవాడిని: అఖిల్

  • హెచ్ఎఫ్ఎల్ బ్రాండ్ అంబాసడర్ గా అఖిల్
  • జెర్సీని ఆవిష్కరించిన యంగ్ హీరో
  • నవంబర్ 25 నుంచి లీగ్ ప్రారంభం
  • యూట్యూబ్ చానల్ లో లైవ్ టెలికాస్ట్

తనకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణమని... ఫుట్ బాల్ ను కూడా ఎంతగానో ఇష్టపడతానని యంగ్ హీరో అఖిల్ అన్నాడు. స్కూల్ రోజుల్లో ఫుట్ బాల్ కూడా ఆడేవాడినని చెప్పాడు. ఫుట్ బాల్ ఆడటం వల్ల ఫిట్ నెస్ పెరుగుతుందని తెలిపాడు. దేశంలో ఫుట్ బాల్ కు ఆదరణ పెరుగుతుండటం ఆనందంగా ఉందని చెప్పాడు. హైదరాబాద్ ఫుట్ బాల్ లీగ్ (హెచ్ఎఫ్ఎల్) బ్రాండ్ అంబాసడర్ గా ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ అఖిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

నవంబర్ 25వ తేదీన హెచ్ఎఫ్ఎల్ మూడో సీజన్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా జెర్సీని అఖిల్ ఆవిష్కరించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆరుగురు ఆటగాళ్లతో నలభై నిమిషాల పాటు జరిగే ఈ లీగ్ లో 12 జట్లు పోటీ పడతాయని చెప్పాడు. మొత్తం పది వారాల పాటు కొనసాగే ఈ లీగ్ లో 135 మ్యాచ్ లు జరుగుతాయని తెలిపాడు. ప్రతి మ్యాచ్ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారమవుతుందని చెప్పాడు.

  • Loading...

More Telugu News