దేవినేని: బొత్స సత్యనారాయణ విమర్శలపై మంత్రి దేవినేని ఆగ్రహం

  • పోలవరంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు 
  • ఏ బేరాలు కుదరకపోవ‌డంతోనే వైసీపీ ఆవిర్భవించింది
  • పట్టిసీమ అవసరం లేదన్న జగన్.. ఇప్పుడైనా ప‌శ్చాత్తాప‌ప‌డాలి

పోలవరం పనుల్లో అవినీతి జరుగుతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ఆరోపణలు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేతలపై ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ‌ మంత్రి దేవినేని ఉమ మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... పోలవరంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అన్నారు.

గ‌తంలో జ‌గ‌న్‌ పోలవరం పవర్ ప్రాజెక్టును చేజిక్కించుకుందామ‌ని చూశారని, ఏ బేరాలు కుదరకపోవ‌డంతోనే వైసీపీ ఆవిర్భవించిందని ఎద్దేవా చేశారు. తాను గ‌తంలో అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు జ‌గ‌న్ నుంచి ఇప్ప‌టికీ స‌మాధానం లేద‌ని అన్నారు. పట్టిసీమ ద్వారా తాము ఇప్పుడు కృష్ణా డెల్టాకు నీరిస్తున్నామని, గ‌తంలో ఆ ప్రాజెక్టు అవసరం లేద‌ని జగన్ అన్నార‌ని దేవినేని గుర్తు చేశారు. ఇప్పుడైనా జ‌గ‌న్ ప‌శ్చాత్తాప‌ప‌డాల‌ని వ్యాఖ్యానించారు.  

More Telugu News