కుక్క: వైరల్ గా మారిన కుక్క ‘విన్యాసం’ వీడియో!

కెన‌డాలో ఓ కుక్క చేసిన సాహ‌సానికి సంబంధించిన ఓ వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ గా మారింది. బ్రౌన్ క‌ల‌ర్‌లో ఉన్న ఓ కుక్క అత్యంత చాక‌చ‌క్యంగా ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ఇనుప చువ్వ‌ల మ‌ధ్య‌లోంచి దూకేసి ఇంట్లోకి వెళ్లిపోయింది. అలా దూక‌డంలో ఎంతో అనుభ‌వం ఉన్న‌ట్లు, ఎంతో తేలిక‌గా ఆ కుక్క దూకిన తీరును చూస్తోంటే నెటిజ‌న్లు వావ్ అన‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

ఈ కుక్క‌ మ‌నుషుల్లా తెలివిగా, తొంద‌ర‌గా ఎంతో చ‌క్క‌గా ఆలోచించింద‌ని నెటిజన్లు కితాబు ఇస్తున్నారు. చువ్వ‌ల మ‌ధ్య‌లోంచి దూకడం అంటే ఏదో మామూలుగా దూకేయ‌లేదు ఈ కుక్క‌. నిలువుగా దూకేస్తే త‌న ప్ర‌య‌త్నం విఫ‌ల‌మవుతుంద‌ని దానికి తెలిసిపోయిందేమో, అందుకే అది దూకే క్ర‌మంలో ప‌క్క‌కు వంగి దూకేసింది.

సినిమాల్లో సాహ‌స సీన్లు వ‌చ్చేట‌ప్పుడు న‌టులు చేసే విన్యాసాల‌ను త‌ల‌పించేలా ఈ కుక్క దూకేసింది. ఈ వీడియోను ఓ నెటిజ‌న్ పోస్ట్ చేసిన కేవ‌లం 10 గంట‌ల్లోనే 40,000 లైకులు రావ‌డ‌మే కాకుండా 1900 రీట్వీల్లు కూడా వ‌చ్చాయంటేనే తెలుసుకోవ‌చ్చు ఈ కుక్క విన్యాసం నెటిజ‌న్లకు ఎంత‌గా న‌చ్చుతోందో...! 

More Telugu News