ntr: ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న‌పై నిర్ణ‌యం ప్ర‌ధానిదే... స్ప‌ష్టం చేసిన కేంద్ర హోంశాఖ‌

భార‌త‌ర‌త్న ఎవ‌రికి ఇవ్వాల‌న్న విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీదే చివ‌రి నిర్ణ‌య‌మ‌ని కేంద్ర హోం శాఖ ప్ర‌క‌టించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు నంద‌మూరి తార‌క రామారావుకు భారతరత్న ఇవ్వాలంటూ ఎంపీ కేశినేని నాని చేసిన‌ డిమాండ్‌పై కేంద్రం ఈ మేర‌కు స్పందించింది. ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇచ్చే విష‌యానికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌ధానమంత్రి కార్యాల‌యానికి పంపిన‌ట్లు హోం శాఖ పేర్కొంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ గ‌త‌ జులై 19న లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని అంశాన్ని లేవనెత్తారు. 377వ నిబంధన ప్ర‌కారం ఎన్టీఆర్‌కు ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని నాని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.
ntr
bharat ratna
kesineni nani
demand
loksabha

More Telugu News