bigboss: బిగ్ బాస్ విజేత శివబాలాజీ?

పవన్ కల్యాణ్ తో శివబాలాజీకి అనుబంధం

శివకు మద్దతు పలుకుతున్న పవన్ అభిమానులు

బుల్లితెర అభిమానులను ఆకట్టుకున్న శివ వ్యక్తిత్వం

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో క్లైమాక్స్ కు చేరుకుంది. ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఫైనల్స్ లో మిగిలారు. వీరిలో ఇకపై ఎవరూ ఎలిమినేట్ కారు. ఒక్కరు మాత్రం సీజన్-1 విజేతగా నిలుస్తారు. అయితే, ఎవరు విజేత కాబోతున్నారనే విషయం ఆసక్తిని రేపుతోంది.  ఇదే సమయంలో విజేతకు సంబంధించి ఓ టాక్ కూడా వినబడుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులంతా శివబాలాజీకే సపోర్ట్ చేస్తున్నారనే వార్త షికారు చేస్తోంది.

పవన్ కు ఆప్తులైన వ్యక్తుల్లో శివబాలాజీ ఒకరు. శివ ప్రేమపెళ్లికి కూడా పవన్ అండగా ఉన్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ అనుబంధం కారణంగా పవన్ ఫ్యాన్స్ అంతా శివబాలాజీకి మద్దతు పలుకుతారని... ఆయన విజేత కావడం ఖాయమని చెబుతున్నారు. వివాదాలకు దూరంగా ఉండటం, ఏ విషయంపైనైనా స్పష్టంగా మాట్లాడటం, హౌస్ మేట్స్ ను జాగ్రత్తగా చూసుకోవడం, తోటి పార్టిసిపెంట్స్ కు ఎలాంటి వంటకాలైనా చేసిపెడుతుండటం వంటివన్నీ శివకు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు.
bigboss
telugu bigboss
siva balaji
telugu bigboss winner

More Telugu News