mahendra singh dhoni: ధోనీ పేరును ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు నామినేట్ చేసిన బీసీసీఐ

క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ కెప్టెన్ల‌లో ఒక‌డిగా పేర్కొనే భార‌త క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరును ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నామినేట్ చేసింది. ప‌ద్మ అవార్డుల‌కు కేవ‌లం ధోనీ పేరును మాత్ర‌మే పంపించిన‌ట్లు బీసీసీఐ అధికారి ఒక‌రు చెప్పారు. భార‌త జ‌ట్టుకు రెండు ప్ర‌పంచ క‌ప్‌లు (2011- వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2007- వ‌ర‌ల్డ్ టీ20) తీసుకువ‌చ్చి, 90 టెస్ట్ మ్యాచుల్లో దాదాపు 10వేల ప‌రుగులు చేసిన ధోనీ పేరును ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ప‌రిశీల‌నకు పంపిన‌ట్లు ఆ అధికారి తెలిపారు. 2009లో ధోనీకి ప‌ద్మ‌శ్రీ అవార్డు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.
mahendra singh dhoni
bcci
padma awards
padma bhushan

More Telugu News