mahesh babu: మహేశ్ ఫ్యామిలీ కోసం 'స్పైడర్' స్పెషల్ షో!

  •  విడుదలకు ముస్తాబవుతోన్న 'స్పైడర్' 
  •  కుటుంబ సభ్యులందరితో కలిసి 'స్పెషల్ షో' చూడనున్న మహేశ్ 
  •  కోలీవుడ్ ప్రముఖుల కోసం చెన్నై లోను స్పెషల్ షో
  •  చురుకుగా జరుగుతోన్న ఏర్పాట్లు    

'స్పైడర్' సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకి ముందు మహేశ్ బాబు ఫ్యామిలీ కోసం ఒక స్పెషల్ షో వేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను తన కుటుంబ సభ్యులందరితోను కలిసి చూడాలని మహేశ్ బాబు అనుకున్నాడట. దాంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణ గారు .. ఆయన తనయులు .. కూతుళ్లు .. అల్లుళ్లు .. మనవళ్లు .. మనవరాళ్లు ఇలా అంతా ఈ స్పెషల్ షోకి హాజరు కానున్నారట. ఈ శని .. ఆదివారాల్లో స్పెషల్ షో వేయనున్నట్టు సమాచారం. ఇక తమిళంలోను ఈ సినిమా రిలీజ్ కి ముందు .. కోలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించి ఒక స్పెషల్ షో వేయడానికి మురుగదాస్ ఏర్పాట్లు చేస్తున్నాడట.              

More Telugu News