దసరా సీజన్ కోసం హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడలకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు!
- గుంటూరు, విజయవాడల మీదుగా ప్రత్యేక రైళ్లు
- ఏసీ, స్లీపర్ బోగీలతో రైలు
- ప్రయాణికులు వినియోగించుకోవాలని ద.మ.రైల్వే సూచన
ఇక హైదరాబాద్ నుంచి కాకినాడకు 07001 నంబరుతో 27, 29 తేదీల్లో సాయంత్రం 6.50కి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి మీదుగా కాకినాడకు మరుసటి రోజు ఉదయం 5.35కు చేరుతుందని, తిరుగు ప్రయాణంలో 07002 నంబరుతో 28, అక్టోబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.55కు బయలుదేరి అదే మార్గంలో మరుసటి రోజు 5.10కి చేరుతుందని అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో 10 స్లీపర్ బోగీలతో పాటు త్రీ టైర్, టూ టైర్ ఏసీ బోగీలు, జనరల్ బోగీలు ఉంటాయని తెలిపారు.