h1b: హెచ్ 1బీ వీసాల జారీని ముమ్మ‌రం చేసిన అమెరికా

అమెరికన్ కాంగ్రెస్‌ విధించిన గ‌డువులోగా హెచ్ 1బీ వీసాల జారీని పూర్తి చేసేందుకు ప్రాసెసింగ్ ప‌నుల‌ను యునైటెడ్ స్టేట్స్ సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ స‌ర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) ముమ్మ‌రం చేసింది. గ‌త ఐదు నెల‌లుగా తాత్కాలికంగా నిలిపివేసిన ఈ సేవ‌ల‌ను మ‌ళ్లీ పున‌రుద్ధరించింది. నైపుణ్యాలు గ‌ల విదేశీ ఉద్యోగుల‌కు అమెరిక‌న్ కంపెనీలు జారీ చేసే ఈ వీసా కోసం వేల సంఖ్య‌లో ద‌రఖాస్తులు ఉండ‌టంతో వాటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసేందుకు యూఎస్‌సీఐఎస్ ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ద‌రఖాస్తుల తాకిడిని త‌ట్టుకోవ‌డానికి గ‌త ఏప్రిల్‌లో యూఎస్‌సీఐఎస్ త‌న సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. మ‌ళ్లీ 2018 ఆర్థిక సంవ‌త్స‌రం కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ప్రాసెస్ చేయ‌డం కోసం త‌న సేవ‌ల‌ను సోమ‌వారం నుంచి ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో 65,000 హెచ్ 1బీ వీసాలు జారీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీటితో పాటు అమెరికా అత్యున్నత డిగ్రీ ఉన్న‌ 20,000 వీసాలు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ప్రాసెసింగ్ పూర్తి చేస్తామ‌ని, లేక‌పోతే ద‌ర‌ఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తామ‌ని యూఎసీఐఎస్ పేర్కొంది.

  • Loading...

More Telugu News