salman khan: మేన‌ల్లుడు ఆహిల్‌తో స‌ల్మాన్.... వైర‌ల్ అవుతున్న ఫొటో!

ఇటీవ‌లే అబుదాబిలో `టైగ‌ర్ జిందా హై` షూటింగ్ పూర్తి చేసుకున్న స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం లండ‌న్ చేరుకున్నాడు. అక్క‌డ త‌న చెల్లెలు అర్పిత ఇంటికి వెళ్లాడు. వాళ్లింట్లో మేన‌ల్లుడు ఆహిల్‌కి పాలు ప‌ట్టిస్తున్న ఫొటోను స‌ల్మాన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. దీనికి `ఆహిల్ అండ్ మి టైమ్‌` అని క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. పాల డ‌బ్బాను జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకున్న స‌ల్మాన్‌, పాల‌ను తాగుతున్న ఆహిల్ ఇప్పుడు నెటిజ‌న్ల మ‌న‌సుల‌ను దోచేస్తున్నారు.

స‌ల్మాన్ ఫొటో షేర్ చేసిన మూడు గంట‌ల్లోనే ఇది వైర‌ల్‌గా మారిపోయింది. ఇప్ప‌టికే దాదాపు ఏడు ల‌క్ష‌ల లైకులు ఈ ఫొటోకి వ‌చ్చాయి. మరోపక్క, 'లండ‌న్ హౌస్ ఆఫ్ కామ‌న్స్' స‌ల్మాన్ ఖాన్‌కు గ్లోబ‌ల్ డైవ‌ర్సిటీ అవార్డును బహూక‌రించింది. అలాగే అక్క‌డ జ‌రిగిన వేడుక‌ల‌కు కూడా స‌ల్మాన్ హాజ‌ర‌య్యాడు. అలాంటి ఓ వేడుక‌కు అర్పిత‌, ఆహిల్ హాజ‌రైన వీడియోను స‌ల్మాన్ షేర్ చేశాడు.

More Telugu News