dog in class: క్లాసు రూములో శునకం... బుద్ధిగా పాఠం విన్న వైనం!

  • పొలిటికల్ సైన్స్ పాఠం జాగ్రత్తగా విన్న శునకం
  •  ఇర్మా హరికేన్ ఎఫెక్ట్
  • జార్జియా యూనివర్సిటీలో కుక్క
  • సోషల్ మీడియాలో వైరల్ పోస్టు

అమెరికాలోని జార్జియా యూనివర్సిటీలో క్లాస్ రూంలో లూనా ఆసక్తిగా ప్రొఫెసర్ చెప్పిన పాఠం వినడం చూసి విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. అట్లాంటాకు చెందిన జెస్సికా లూవిస్‌ జార్జియా యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసిస్తోంది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం ఆమె ప్రత్యేక క్లాసుకు హాజరుకావాల్సి వచ్చింది. అదే సమయంలో ఇర్మా హరికేన్ ఫ్లోరిడాను ముంచెత్తడంతో పాటు ఇంట్లో ఎవరూ లేరు.

దీంతో తన పెంపుడు కుక్క లూనాను ఇంట్లో వదిలేయడం ఇష్టం లేక, ప్రొఫెసర్ కి వివరించి, తరగతికి తనతోపాటు దానిని కూడా తీసుకురావడానికి అనుమతి అడిగింది. ఆయన అంగీకరించడంతో తనతోపాటు లూనాను కూడా తరగతి గదికి తీసుకెళ్లింది. అయితే తరగతిలో అధ్యాపకుడు పొలిటికల్ సైన్స్ పాఠం బోధిస్తున్నంతసేపు లూనా ఆమె కుర్చీ ఎదురుగా బుద్ధిగా కూర్చుంది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్‌ బుక్‌ ద్వారా తెలియజేస్తూ ఆ ఫోటోలు పోస్టు చేసింది. ఇవి వైరల్ గా మారాయి. లూనాను చాలా మంది మెచ్చుకుంటున్నారు. 

More Telugu News