jet airways: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో విదేశీ ప్రయాణికుడి అరెస్టు

  • విమానంలో ఘర్షణ పడ్డ విదేశీ ప్రయాణికులు
  • కాక్ పిట్ లో ప్రవేశించిన ప్రయాణికుడు
  • ఆగ్రహం వ్యక్తం చేసి, ఫిర్యాదు చేసిన పైలట్
రాజమండ్రి ఎయిర్ పోర్టులో విదేశీ ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళ్లే జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఇద్దరు విదేశీ ప్రయాణికులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఒక ప్రయాణికుడు నేరుగా కాక్ పిట్ లోకి ప్రవేశించాడు. దీంతో పైలట్ ఆగ్రహం వ్యక్తం చేసి, ఎయిర్ పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విమానం ల్యాండ్ కాగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 
jet airways
foreign passengers arrest
rajmundry airport

More Telugu News