ర్యాంప్‌పై హొయ‌లొలికించిన మ‌హిళా క్రికెట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌

18-09-2017 Mon 14:47
భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు వైస్‌కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ ఓ ఫ్యాష‌న్ షోలో ర్యాంప్ వ్యాక్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సెప్టెంబ‌ర్ 15న ప్రారంభ‌మైన మైసూర్ ఫ్యాష‌న్ వీక్ 2017లో ఆమె పాల్గొంది. ఈ వేడుక చివ‌రి రోజైన ఆదివారం నాడు హ‌ర్మ‌న్‌ప్రీత్ డిజైన‌ర్ అర్చ‌నా కొచ్చార్ రూపొందించిన దుస్తులు ధ‌రించి ర్యాంప్ వ్యాక్ చేసింది. నీలి రంగు లెహంగా ధ‌రించి ర్యాంప్ మీద న‌డిచి హ‌ర్మ‌న్‌ప్రీత్ అక్క‌డికి వ‌చ్చిన వారిని ఆక‌ర్షించింది. త‌న మొద‌టి ర్యాంప్ వాక్ అనుభూతిని ఆమె మీడియాతో పంచుకుంది. `నేను ర్యాంప్ మీద న‌డ‌వ‌డం ఇదే మొద‌టిసారి. అందుకే కొంచెం ఆందోళ‌న చెందాను. అయిన‌ప్ప‌టికీ ఏదైనా కొత్త‌గా చేయాల‌నే త‌ప‌న‌తోనే ర్యాంప్ వాక్ కి ప్ర‌య‌త్నించాను` అని హ‌ర్మ‌న్ తెలిపింది.