rgv: వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రకటనపై లక్ష్మీ పార్వతి ఏమన్నారంటే..!

  • వర్మ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు
  • ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించవద్దు
  • సినిమా ద్వారా నిజాలు బయటపెట్టాలి
  • నిజాలు నిర్భయంగా తీస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు
  • సినిమా తీసేముందు వర్మ నాతో చర్చించాలి
  • లక్ష్మీ పార్వతి స్పందన 
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రకటనపై దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. రాంగోపాల్ వర్మ ప్రకటన గురించి ఆమె మాట్లాడుతూ, రాంగోపాల్ వర్మ తనను సంప్రదించలేదని అన్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని వాస్తవంగా చిత్రీకరించే వారి కోసం ఎదురు చూస్తున్నానని ఆమె తెలిపారు.

ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించవద్దని ఆమె సూచించారు. సినిమా ద్వారా నిజాలు బయటపెట్టాలని ఆమె అన్నారు. నిజాలు నిర్భయంగా తీస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు. సినిమా తీసేముందు వర్మ తనతో చర్చించాలని ఆమె సూచించారు. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని బాలకృష్ణ ప్రకటించినప్పుడు కూడా ఆమె ఇదే డిమాండ్ చేయడం విశేషం. 
rgv
ramgopal verma
laxmi parvathi
laxmi's ntr movie

More Telugu News