naharjuna: 'రాజుగారి గది 2' ట్రైలర్ వచ్చేస్తోంది!

  •  'రాజుగారి గది'కి ఇది సీక్వెల్ కాదు 
  •  మానసిక వైద్యుడిగా నాగార్జున
  •  ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్
  •  వచ్చేనెల 13న సినిమా విడుదల 

నాగార్జున ప్రధానమైన పాత్రను పోషించిన 'రాజుగారి గది 2' .. ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ... ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది. మానసిక వైద్యుడిగా నాగార్జున నటించిన ఈ సినిమా, అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది 'రాజుగారి గది'కి సీక్వెల్ కాదనీ, కథా కథనాలు .. పాత్రల తీరుతెన్నులు కొత్తగా వుంటాయని నాగ్ చెప్పడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

 అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. సమంతా .. శీరత్ కపూర్ లు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. నాగ్ మొదటిసారిగా చేసిన హారర్ కామెడీ కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి మరి.   

More Telugu News