vijay devarakonda: 'అర్జున్ రెడ్డి'కి తిరుగులేకుండాపోయింది!

  •  కొనసాగుతోన్న 'అర్జున్ రెడ్డి జోరు
  •  పోటీకి నిలబడలేకపోయిన ఇతర సినిమాలు  
  •  ఓవర్సీస్ లో 1.75 మిలియన్ మార్క్
  •  హీరో,హీరోయిన్స్ కి వరుస అవకాశాలు  

విడుదలకి ముందే యూత్ లో ఆసక్తిని పెంచుతూ వచ్చిన 'అర్జున్ రెడ్డి' .. విడుదల తరువాత ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన దూకుడు చూపిస్తోంది. ఈ సినిమా తరువాత వచ్చిన సినిమాలు థియేటర్స్ లో నిలబడలేకపోవడం వలన, 'అర్జున్ రెడ్డి'కి తిరుగులేకుండాపోయింది.

 ఓవర్సీస్ లో ఈ సినిమా నిన్నటితో 1.75 మిలియన్ మార్క్ ను అందుకుంది. స్టార్ హీరోల సినిమాలు సైతం కాస్త ఆలస్యంగా అందుకునే ఈ మార్క్ కి ఈ సినిమా అవలీలగా చేరుకోవడం విశేషం. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి అక్కడి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక హీరోగా చేసిన విజయ్ దేవరకొండకి .. హీరోయిన్ గా చేసిన షాలిని పాండేకి అమాంతంగా క్రేజ్ పెరిగిపోయింది. వాళ్లిద్దరికీ వరుసగా అవకాశాలు వచ్చిపడుతుండటం చెప్పుకోదగిన విషయం.

  • Loading...

More Telugu News