deepa jayakumar: మళ్లీ భర్త దగ్గరికి చేరిన దీపా జయకుమార్!

  • ఆరు నెలలుగా దూరంగా ఉంటున్న దీప, మాధవన్
  • కలిసుందామని కోరిన దీప
  • వెంటనే సరేనన్న మాధవన్
  • కలసి అమ్మ సమాధి వద్ద నివాళి
గడచిన ఆరు నెలలుగా భర్తతో దూరంగా ఉన్న దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్, తిరిగి తన భర్త మాధవన్ చెంతకు చేరారు. జయలలిత మరణం తరువాత దీప, రాజకీయాల్లోకి ప్రవేశించి 'ఎంజీఆర్ అమ్మ దీప పేరవై' పేరిట పార్టీని స్థాపించగా, భర్తతో విభేదాలు వచ్చి విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో పోయిస్ గార్డెన్ ను తన అధీనంలోకి తీసుకోవాలని దీప ప్రయత్నించినప్పుడు కూడా మాధవన్ ఆమె వెంటే ఉన్నారు. అప్పటి నుంచి కలసి కనిపించని వీరిద్దరూ తాజాగా, అమ్మ సమాధి వద్దకు కలసి వచ్చిన వివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ, రాజకీయాలు, వేరని, కుటుంబం వేరని వ్యాఖ్యానించారు. తమిళనాట సీఎం పళనిస్వామి ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని, ఆ పార్టీకి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని నిప్పులు చెరిగారు. నీట్ నిర్వహణలో ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగానే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కాగా, తనతో కలసి వుండాలని దీప కోరడంతోనే కలిసుండాలని నిర్ణయం తీసుకున్నానని మాధవన్ పేర్కొన్నారు.
deepa jayakumar
madhavan
tamilnadu
jayalalita

More Telugu News