Kajal: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • రవితేజ కొత్త చిత్రంలో కాజల్
  • బ్రాండ్ అంబాసడర్ గా విజయ్ దేవరకొండ 
  • సందీప్ కిషన్ ద్విభాషా చిత్రం ప్రారంభం

*  ప్రస్తుతం నందమూరి కల్యాణ్ రామ్ సరసన 'ఎమ్మెల్యే' చిత్రంలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ త్వరలో రవితేజ చిత్రంలో కథానాయికగా నటించనుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా కాజల్ ను తీసుకుంటున్నట్టు సమాచారం.    
*  అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకి ఒక్కసారిగా స్టార్ స్టేటస్ వచ్చేసింది. దీంతో పలు సినిమాలతో పాటు పలు కమర్షియల్స్ కూడా ఆయనకు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాదులో ప్రారంభమవుతున్న కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కి బ్రాండ్ అంబాసడర్ గా విజయ్ ని ఎంచుకున్నారు.
*  సందీప్ కిషన్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న 'నరగాసురన్' తమిళ చిత్రం షూటింగ్ నిన్న చెన్నయ్ లో మొదలైంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఏక కాలంలో నిర్మిస్తున్నారు.      

More Telugu News