pawan kalyan: సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సురేశ్ కృష్ణ‌మూర్తి మృతికి సంతాపం తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

బ్రెయిన్ స్ట్రోక్ కార‌ణంగా చ‌నిపోయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సురేశ్ కృష్ణ‌మూర్తి మృతి ప‌ట్ల హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపం తెలిపారు. ఆయ‌న‌తో త‌న‌కున్న వ్య‌క్తిగ‌త, వృత్తిగ‌త ప‌రిచ‌యాన్ని ప‌వ‌న్ ట్విట్ట‌ర్‌లో గుర్తుచేసుకున్నారు. త‌న‌ని చివ‌రి సారిగా క‌లిసిన విష‌యాలు, ఆయ‌న ముఖం ఇప్ప‌టికీ త‌న క‌ళ్ల ముందే మెదులుతున్నాయ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. సురేశ్ కృష్ణ‌మూర్తి గ‌త 25 ఏళ్లుగా హిందూ ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్నారు. సినిమా, రాజ‌కీయ జర్నలిజంలో ప్రింట్ మీడియాలో సురేశ్ ప‌నిచేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలియ‌జేశారు.
pawan kalyan
krishna murthy
death
mourn
brain stroke

More Telugu News