snajay dut: నా కుమారుడు నాలా కాకూడ‌దు: స‌ంజ‌య్‌ద‌త్‌

  • నా వల్ల మా నాన్న ప‌డ్డ కష్టం.. మా అబ్బాయి వ‌ల్ల నేను ప‌డాల‌నుకోవ‌ట్లేదు
  • మ‌న‌సు మాటే కాదు... అప్పుడ‌ప్పుడు మెద‌డు మాట కూడా వినండి
  • ఢిల్లీ మైండ్ రాక్స్ కార్య‌క్ర‌మంలో సంజూ 

త‌న తండ్రి త‌న‌ను సాధార‌ణ పిల్ల‌ల్లాగే పెంచార‌ని, త‌న కుమారుడిని కూడా తాను అలాగే పెంచుతున్నానని బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ తెలిపారు. త‌న కుమారుడు త‌న‌లా కాకూడ‌ద‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఢిల్లీలో జ‌రిగిన మైండ్ రాక్స్ 2017 కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చాలా విషయాల‌ను ఆయ‌న అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

మ‌న‌సు మాట మాత్ర‌మే కాకుండా అప్పుడ‌ప్పుడు మెద‌డు చెప్పే మాట కూడా వినాల‌ని ఆయ‌న సూచించారు. కాలేజీ రోజుల్లో తాను డ్ర‌గ్స్ తీసుకున్నాన‌ని, ఆ వ్య‌స‌నం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి తనకు ప‌దేళ్లు ప‌ట్టిందని చెప్పారు. ఒక చిన్న పేప‌ర్ స్టేట్‌మెంట్ కార‌ణంగా త‌న ద‌గ్గ‌ర అక్ర‌మంగా ఆయుధం ఉంద‌నే నెపంతో కేసు వేశార‌ని సంజ‌య్ తెలిపారు. జైల్లో త‌న ఇష్ట‌దైవం శివుడి పుస్త‌కాలు చ‌దువుతూ కాలం గ‌డిపేవాడినని చెప్పారు. సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ త‌న అభిమాన న‌టుడ‌ని, `మున్నాభాయ్‌`, `వాస్త‌వ్‌` సినిమాలంటే చాలా ఇష్ట‌మ‌ని సంజ‌య్ అన్నారు.

More Telugu News