mla roja: కలలు కనండి.. సాకారం చేసుకోండి: విద్యార్థులకు రోజా క్లాసు

వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా కాసేపు జూనియర్ కాలేజీ విద్యార్థులతో సరదాగా గడిపారు. ఉపాధ్యాయురాలిగా మారి, వారికి మార్గ నిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళ్తే, నగరిలోని ప్రభుత్వ మహిళల జూనియర్ కాలేజీకి శాశ్వత భవనాలను నిర్మించారు. ఈ నూతన భవనాలను ఈ రోజు రోజా ప్రారంభించారు. అనంతరం ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చాక్ పీస్ తీసుకుని, బ్లాక్ బోర్డుపై 'ఓం... కలలు కనండి.. సాకారం చేసుకోండి' అని రాశారు. ఆ తర్వాత విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు.

  • Loading...

More Telugu News