balakrishna: 'పెళ్లికాని ప్రసాద్' తరహా పాత్రలో బాలయ్య?

  •  102వ చిత్రం షూటింగులో బాలయ్య 
  •  కథలోను .. పాత్రలోను కొత్తదనం 
  •  40 యేళ్ల బ్యాచిలర్ గా .. భగ్నప్రేమికుడిగా
  •   సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు 

బాలకృష్ణ 102వ సినిమాకి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ ఎలా కనిపించబోతున్నాడు? ఆయన పాత్ర ఎలా వుండబోతోంది? అనే విషయాలపై అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.

 ఈ సినిమాలో ఆయన 'పెళ్లికాని ప్రసాద్' తరహా పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. 40 ఏళ్లు వచ్చేవరకూ పెళ్లి కాకుండా ఉండిపోతాడట. ఆ తరువాత నయనతారను ప్రేమించి భగ్న ప్రేమికుడిగా మారిపోతాడని అంటున్నారు. అందుకు గల కారణాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. సెకండాఫ్ లో మళ్లీ నయనతార ఆయన జీవితంలోకి ఎంటరవుతుందని చెబుతున్నారు. మరో కథానాయికగా నటాషా దోషి నటిస్తోన్న ఈ సినిమా, సంక్రాంతికి విడుదల కానుంది.   

More Telugu News