rajani: 'అంతమాట అనేస్తావా?' అంటూ కమల్ పై మండిపడుతోన్న రజనీ ఫ్యాన్స్!

  •  తన భావాలు వేరంటోన్న కమల్ 
  •  వేరే పార్టీల్లో చేరేదే లేదని స్పష్టం 
  •  రజనీ ఉద్దేశమేమిటో తెలియడం లేదు 
  •  ఆయనని తన పార్టీలో చేర్చుకోవడానికి అభ్యతరం లేదన్న కమల్ 

 

తమిళనాట రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పార్టీ పెడితే చేరడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ చాలామంది ప్రముఖులు సంకేతాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా కమలహాసన్ సంకేతాలిచ్చారు. ఈ విషయంపై విజయదశమికి ఆయన ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

తన భావాలు వేరనీ .. లక్ష్యాలు వేరనీ, అందువలన తాను ఏ పార్టీతో కలవనని కమల్ అన్నారు. అంతేకాదు .. రజనీ మనసులో ఏముందో తనకి తెలియడం లేదనీ, ఆయన ఇష్టపడితే తన పార్టీలో చేర్చుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. రజనీని అంత తక్కువ చేసి మాట్లాడతావా? అంటూ ఆయన ఫాన్స్ కమల్ పై మండిపడుతున్నారు. కమల్ కి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.     

More Telugu News