malakpet: హైదరాబాద్ లో కిలో ఉల్లి రూ. 5... తట్టుకోలేక రైతు ఆత్మహత్య

  • నిన్నటివరకూ రూ. 1600 వరకూ క్వింటాల్ ధర
  • మహారాష్ట్రలో ఉల్లి వ్యాపారులపై దాడులు
  • అదే భయంతో మార్కెట్లోకి వచ్చిన భారీ ఉల్లి నిల్వలు
  • పెట్టుబడి కూడా దక్కక రైతుల దిగాలు

ఈ ఉదయం హైదరాబాద్ మలక్ పేట ప్రధాన మార్కెట్ కు ఉల్లిపాయలు తీసుకువచ్చిన ఓ రైతు, అక్కడి పరిస్థితిని చూసి గుండెపోటుతో మరణించాడు. ఆరుగాలం శ్రమించి, వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి, పంటను పండిస్తే, దాన్ని మార్కెట్ కు చేర్చేందుకు అయిన ఖర్చు కూడా రాకపోవడం ఆ రైతు ప్రాణాలను కబళించింది. ఈ ఉదయం మలక్ పేట మార్కెట్లో క్వింటాల్ ఉల్లికి రూ. 500 ధర పలికింది. అంటే, కిలోకు రూ. 5 అన్నమాట.

మహారాష్ట్రలో ఉల్లిపాయల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న అనుమానంతో, వ్యాపారులపై అధికారులు దాడులు చేసి పెద్దఎత్తున ఉల్లి నిల్వలను స్వాధీనం చేసుకోగా, అటువంటి దాడులే ఇక్కడా జరగవచ్చన్న అనుమానంతో, భారీ ఎత్తున ఉల్లిని మార్కెట్లోకి తరలించారు. దీంతో నిన్నటివరకూ క్వింటాలుకు రూ. 1200 నుంచి రూ. 1600 వరకూ పలికిన ధర ఒక్కసారిగా పాతాళానికి జారింది. ఈ పరిస్థితి తాత్కాలికమేనని, కొన్ని రోజుల్లోనే ధర తిరిగి సాధారణ స్థితికి చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More Telugu News