north korea: ఏ క్షణమైనా దాడి చేసేందుకు కిమ్ సిద్ధం: సంకేతాలు అందాయన్న అమెరికా

  • హైడ్రోజన్ బాంబు ప్రయోగాన్ని విశ్లేషించిన మాజీ సైనికులు
  • అమెరికాపై దాడికి తగినంత శక్తిని సమకూర్చుకున్న కిమ్
  • గువామ్ తో పాటు ప్రధాన భూభాగంపైనా దాడికి సిద్ధం
  • భారీ స్థాయిలో విరుచుకుపడే కుట్ర చేస్తున్నారని అనుమానం

ఇటీవల ఉత్తర కొరియా జరిపిన హైడ్రోజన్ బాంబును విశ్లేషించిన అమెరికన్ నిపుణులు, గతంలో జరిపిన పరీక్షలతో పోలిస్తే, ఇది చాలా పక్కాగా జరిగిందని, కచ్చితత్వం కూడా అధికమని అభిప్రాయపడ్డారు. ఈ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం కావడంతో ఏ క్షణమైనా అమెరికాపై దాడి జరిపేందుకు కిమ్ సిద్ధంగా ఉన్న సంకేతాలు వెలువడ్డాయని మాజీ సైనికాధికారులు పేర్కొన్నారు. నార్త్ కొరియాకు క్షిపణి ప్రయోగ సామర్థ్యం తక్కువేనని ఇంతవరకూ భావిస్తూ వచ్చిన అమెరికాకు ఇది షాకిచ్చిన అంశమని వారు అన్నారు.

దాదాపు 2,300 మైళ్ల ఎత్తులో ప్రయాణించిన మిసైల్ పసిఫిక్ మహాసముద్రంలో పడిందని గుర్తు చేసిన వారు, అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ప్రాంతానికి అత్యంత సమీపానికి ఇది వచ్చిందని తెలిపారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తమపై దాడికి దిగే సత్తా కిమ్ సమకూర్చుకున్నారని, గువామ్ తో పాటు యూఎస్ లోని ప్రధాన భూభాగాలపైకీ కిమ్ వదిలే క్షిపణులు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు తొలి వారంలో గువామ్ పై దాడికి దిగుతామని సంచలన హెచ్చరికలు చేసిన ఉత్తర కొరియా, ఆపై మౌనంగా ఉండటం వెనుక ఏదో జరుగుతోందని, బలమైన వ్యూహం కారణంగానే కిమ్ కొద్దికాలం ఆగాలని నిర్ణయించుకున్నారని వారు అనుమానిస్తున్నారు. తమపై భారీ స్థాయిలో దాడికి కిమ్ ప్లాన్ చేస్తూ ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News