: స్పైడర్ సినిమా ట్రైలర్ పై టాలీవుడ్ యంగ్ హీరోల ప్రశంసల జల్లు!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మ‌హేశ్ బాబు ‘స్పైడ‌ర్’ సినిమా ఈ నెల‌ 27వ తేదీన రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ‘నేను స్పైడర్ మ్యానో.. సూపర్ మ్యానో కాదు.. ఈ సొసైటీని ఛేంజ్ చేయట్లేదు’ అంటూ మ‌హేశ్ బాబు ఈ ట్రైల‌ర్‌లో చెప్పిన డైలాగు అభిమానుల‌నే కాదు టాలీవుడ్ యంగ్ హీరోల‌ను సైతం క‌ట్టిప‌డేస్తోంది. ఈ ట్రైల‌ర్‌పై స్పందించిన న‌టుడు సుధీర్ బాబు.. ఈ ట్రైల‌ర్ మామూలుగా లేదుగా అని పేర్కొన్నాడు. ‘స్పైడర్ మ్యానో.. సూపర్ మ్యానో కాదు.. ఆయ‌న మ‌న‌కు నెంబ‌ర్ 1’ అని పేర్కొన్నాడు.

మ‌రో న‌టుడు రాజ్‌త‌రుణ్ స్పందిస్తూ.. ‘దుమ్ము దుమారం.. ఈ సినిమా కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నా’న‌ని అన్నాడు. దర్శకుడు కొర‌టాల శివ స్పందిస్తూ.. ‘స్టైలిష్‌, ప‌ర్‌ఫెక్ట్.. సెప్టెంబ‌ర్ 27 కోసం ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నాడు. ఈ ట్రైల‌ర్‌ మ‌హేశ్ బాబు ప‌నిత‌నానికి నిద‌ర్శ‌నమ‌ని దర్శకుడు హరీశ్ శంకర్ పేర్కొన్నాడు.

More Telugu News