vishal: చెప్పినట్టుగానే విశాల్ హిట్ కొట్టేశాడు!

కోలీవుడ్లో మాస్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకునే హీరోల్లో విశాల్ ముందు వరుసలో కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా 'తుప్పారివాలన్' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలకమైన పాత్రను పోషించింది. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజునే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

 అక్కడి వెబ్ సైట్లు .. పత్రికలు ఈ సినిమాకి మంచి రేటింగ్ ను ఇచ్చాయి. మిస్కిన్ టేకింగ్ .. విశాల్ యాక్టింగ్ ఈ సినిమాను నిలబెట్టాయని చెబుతున్నారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయని అంటున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతామని ప్రమోషన్స్ లో విశాల్ చెప్పాడు. చెప్పినట్టుగానే హిట్ కొట్టేసి అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు.   

  • Loading...

More Telugu News