nani: నెక్స్ట్ మూవీ నానితోనే అంటోన్న డైరెక్టర్!

వరుస సినిమాలు .. వరుస విజయాలతో నాని దాదాపు స్టార్ హీరో ప్లేస్ కి చాలా దగ్గరగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆయన ఒక వైపున 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తూనే .. మరో వైపున 'కృష్ణార్జున యుద్ధం' చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. వాళ్లలో తాతినేని సత్య కూడా కనిపిస్తున్నాడు.

 'భీమిలీ కబడ్డీ జట్టు' .. 'శంకర' వంటి సినిమాలు చేసిన సత్య .. 'వీడెవడు'తో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెక్స్ట్ మూవీ నానితో చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పాడు. కథ కూడా రెడీగా ఉందనీ .. త్వరలోనే నానికి వినిపిస్తానని అన్నాడు. నానికి కథ నచ్చితే సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం తీసుకోనని చెప్పాడు. గతంలో సత్యతో 'భీమిలీ కబడ్డీ జట్టు' చేసిన నానీకి .. ఇప్పటి నానికి క్రేజ్ పరంగా చాలా తేడా వుంది. మరి ఆయన ఏమంటాడో చూడాలి.    

More Telugu News