kangana ranaut: 'మణికర్ణిక'లో అత్యంత సహజంగా యుద్ధ సన్నివేశాలు!

'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించి శభాష్ అనిపించుకున్న క్రిష్, తన తదుపరి సినిమాకి కూడా చారిత్రక నేపథ్యం కలిగిన కథనే ఎంచుకున్నారు. 'వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి' జీవిత చరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రగా ఈ సినిమా రూపొందుతోంది.

సహజంగానే ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఆ యుద్ధ సన్నివేశాలు అత్యంత సహజంగా అనిపించడం కోసం, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ 'నిక్ పావెల్'ను ఎంపిక చేసుకున్నారు. 'బ్రేవ్ హార్ట్' .. ' గ్లాడియేటర్' వంటి సినిమాలకి ఆయన పనిచేశాడు. 'మణికర్ణిక' కోసం ఆయన కంగనాతో పాటు 300 మంది లోకల్ ఫైటర్స్ కి శిక్షణ ఇచ్చాడట.  అందువలన ఈ సినిమాలో వార్ సీన్స్ అత్యంత సహజంగా అనిపిస్తాయని అంటున్నారు.    
kangana ranaut

More Telugu News