sunil: ఎన్టీఆర్ వచ్చేలోగా వసూళ్లు రాబట్టేయాలి!

ఓ అరడజను సినిమాల వరకూ రేపు విడుదల కానున్నాయి. ఉంగరాల రాంబాబు .. కథలో రాజకుమారి .. శ్రీవల్లీ .. వీడెవడుతో పాటు మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో 'ఉంగరాల రాంబాబు' కాస్త పెద్ద సినిమాగా చెప్పుకోవాలి. ఇక కథలో రాజకుమారి .. శ్రీవల్లీ ఈ రెండూ కూడా విజువల్స్ పరంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ ఆరు సినిమాల్లో మంచి కంటెంట్ వున్నవి మాత్రమే థియేటర్స్ లో నిలబడతాయి. అదీ .. 'జై లవ కుశ' సినిమా వచ్చేంత వరకే. 'జై లవకుశ'తో ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడంటే ఆ పోటీని తట్టుకోవడం కష్టమే అవుతుంది. భారీ బడ్జెట్ .. భారీ తారాగణం .. భారీ అంచనాలు .. ఇలా భారీతనంతో ఈ సినిమా వచ్చేలోగా, థియేటర్స్ లో వున్న సినిమాలు వసూళ్లు రాబట్టేయాలి .. లేదంటే కష్టమే.  

  • Loading...

More Telugu News