yash: కన్నడ 'అర్జున్ రెడ్డి' హీరో ఖరారైనట్టే!

తెలుగులో చిన్న సినిమాగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. కొత్తగా విడుదలవుతోన్న సినిమాలకి గట్టి పోటీని ఇస్తూ, వసూళ్ల విషయంలో అదే జోరును కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఇతర భాషల దర్శక నిర్మాతలను .. హీరోలను ఆకర్షించింది. దాంతో ఈ సినిమాను ఆయా భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 తమిళంలో రీమేక్ చేయడానికి ధనుష్ రైట్స్ తీసుకున్నాడు. ఇక హిందీలో ఈ సినిమాను చేయడానికి రణ్ వీర్ సింగ్ ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయడానికి రాక్ లైన్ వెంకటేశ్ ఆసక్తిని చూపుతున్నాడు. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను అక్కడి యంగ్ హీరో 'యష్' తో చేయించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ తరహా పాత్రలు యష్ అయితే బాగా చేస్తాడనే ఉద్దేశంతో, ఆయననే ఫైనల్ చేశారనేది తాజా సమాచారం. ఇక కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.   

More Telugu News