: 'మ్యాట్రిమోనీ డాట్ కామ్' పబ్లిక్ ఇష్యూకు విపరీతమైన డిమాండ్!

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలు నిర్వహిస్తూ, దాదాపు అన్ని భారతీయ భాషల్లో వివాహ సంబంధాల వెబ్ సైట్ లను నిర్వహిస్తూ, పెళ్లిళ్లు కుదిర్చే సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న 'మ్యాట్రిమోనీ డాట్ కామ్'కు భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. నిధుల సమీకరణ నిమిత్తం సంస్థ 28 లక్షల వాటాలను విక్రయించాలని భావించగా, ఏకంగా 1.25 కోట్ల వాటాలకు డిమాండ్ వచ్చింది. ఐపీఓకు వచ్చిన తొలి వివాహ సంబంధాలు కుదిర్చే సంస్థగా మ్యాట్రిమోనీ నిలువగా, తమ అభివృద్ధి, విస్తరణ కార్యకలాపాల నిమిత్తం అవసరమయ్యే రూ. 500 కోట్ల నిధుల కోసం ఇన్వెస్టర్ల తలుపుతట్టిందీ సంస్థ. ఐపీఓకు దరఖాస్తుల గడువు ముగిసేసరికి 441 శాతం అదనపు సబ్ స్క్రిప్షన్ వచ్చిందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. యూఎస్ వెంచర్ కాపిటల్ సంస్థ బెస్సెమర్ వెంచర్ పార్ట్ నర్స్ మ్యట్రిమోనీకి నిధులందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సంవత్సరం ఇప్పటివరకూ 20 ఐపీఓలు మార్కెట్ ను తాకగా, అన్నీ ఓవర్ సబ్ స్క్రీయిబ్ కాగా, రెండు కంపెనీలకు 100 రెట్లకు పైగా స్పందన లభించింది.

More Telugu News