mahesh babu: ఒకే రోజున 'స్పైడర్' నుంచి ట్రైలర్ .. 'జై లవ కుశ' నుంచి తమన్నా ఐటమ్ సాంగ్ టీజర్?

మురుగదాస్, మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'స్పైడర్' సినిమా ఈ నెల 27వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో 'స్పైడర్' నుంచి ఈ నెల 15వ తేదీన ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా చూస్తున్నారు.

 ఈ నేపథ్యంలో అదే రోజున తమ సినిమాకి సంబంధించిన సాంగ్ టీజర్ ను వదలడానికి 'జై లవకుశ' టీమ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ .. తమన్నాల కాంబినేషన్లో ఒక సాంగ్ ను చిత్రీకరించారు. ఆ సాంగ్ పై కట్ చేసిన టీజర్ ను ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. 'స్పైడర్' ట్రైలర్ .. 'జై లవ కుశ ' సాంగ్ టీజర్లలో ఏది ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.     

More Telugu News